14, నవంబర్ 2021, ఆదివారం

మొక్కలంటే ఎంత నిర్లక్ష్యం...?

 వివిధ రకాల మొక్కల్ని వర్ణించడం లో లేదా ప్రస్తావించడం లో చాలామంది రచయిత లు ఇవ్వవలసినంత ప్రాధాన్యత ఇవ్వరు అనిపిస్తుంది.అదీ అవసరమైన సమయం లో అవసరమనంత మేరకే సుమా..!

మనం ఏదో ఊరి పక్క నుంచి రోడ్డు మీద పోతుంటాము.ఆ పక్క నే చూస్తే ఏవో పిచ్చి మొక్కలు కనిపిస్తాయి.పరీక్షగా చూస్తే వాటి అందం వాటిదే.రకరకాల వర్ణాల్లో పూవులు ఉంటాయి.కొన్ని వాటికి తీరైన ఆకులు ఉంటాయి. వాటి పేరు తెలుసుకోవాలని అడిగితే అదేమిటో చాలామందికి తెలియదు.

ఈనాటి రచయితలు కొందరు సమయం వచ్చినపుడు వాటిని పొదలు అనో,నానా రకాల మొక్కలు అనో అలా గుండు గుత్త గా రాసేస్తుంటారు తప్పా తెలుసుకుని దాని పేరు ని కనీసం చెబితే ఎంత బాగుంటుంది.

మనం మన స్పృహ లేకుండానే కొన్ని వందల మొక్కల్ని బయట చూసి ఉంటాము.కాని పెద్ద గా వాటి గూర్చి పట్టించుకోము.కనీసం కొన్నిటి పేర్లు కూడా తెలుసుకోము.అది ప్రకృతి పట్ల మన నిర్లక్ష్యమే అనుకోవాలి.

అయితే చాలా విదేశీ నవలల్లో పెద్ద ప్రాచుర్యం పొందని మొక్కల్ని ,తీగల్ని కూడా సందర్భానుగుణం గా ప్రస్తావిస్తుంటారు. అది వారికి తమ ప్రాంతం లో పెరిగే మొక్కలపై ఉండే అనుబంధం అనుకోవచ్చు. ఉదాహరణ కి Crocuses,Papple,Mezereon,Wisteria ఇలాంటి వాటి గూర్చి ప్రస్తావిస్తూంటారు.ఇంకా చాలా ఉన్నాయి గుర్తు రావడం లేదు. ఇక బిర్చ్,లార్చ్ ,ఎబోనీ వంటి వృక్షాల గురించి అయితే చెప్పనవసరమే లేదు.

ప్రతి ప్రాంతానికి తమ కే సొంతమైన మొక్కలు,లతలు మన చుట్టు పక్కల ఉంటాయి.వాటిని ఎంతో కొంత సందర్భాన్ని బట్టి రచయితలు తమ రచనల్లో రికార్డ్ చేస్తే ఎంత బాగుంటుంది.బాగా తెలిసిన మొక్కల్ని వాటిని వదిలేసి..!

పోను పోను మన స్థితి ఎలా తయారయిందంటే కొన్ని మొక్కలు కనిపించినా వాటి పేర్లు చెప్పే వారు లేక ఏదో ఒకటిలే అని వదిలేయడం జరుగుతూంది.గూగూల్ లో సెర్చ్ చేసినా కొన్ని వాటికి బయట జనాలు అనుకునేదానికి పొంతన కుదరడం లేదు. 

 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వీథికుక్క-1

 ఒకరోజున, అది ఏ రోజో సరిగా గుర్తులేదు గానీ...రమారమి ఆరు నెలల క్రితం మా బయట గోడ ని ఆనుకుని ఓ బక్క కుక్క పడుకుని ఉంది. వాన చినుకులు పడుతున్నాయ...