11, జనవరి 2022, మంగళవారం

ద వర్జిన్ అండ్ ద జిప్సీ (తెలుగు అనువాదం)



ఆంగ్లమూలం: డి.హెచ్.లారెన్స్

తెలుగుసేత : మూర్తి కెవివిఎస్



శ్రీభద్ర ప్రచురణలు


---------------------------------


ద వర్జిన్ అండ్ ద జిప్సీ (డి.హెచ్.లారెన్స్ ఆంగ్లమూలానికి తెలుగు అనువాదం)


అనువాదకులు: మూర్తి కెవివిఎస్

(godavari333@gmail.com)


ప్రథమ ముద్రణ : జనవరి,2022


ముఖచిత్రం : డి.హెచ్.లారెన్స్


వెల : రూ.100/-


శ్రీభద్ర ప్రచురణలు : 2


కాపీలకు : అన్నీ ప్రముఖ పుస్తక కేంద్రాలు


------------------------------------------------


అనువాదకుని మాట

------------------


ఈ నవలిక "ద వర్జిన్ అండ్ ద జిప్సీ" ఆంగ్ల రచయిత డి.హెచ్.లారెన్స్ 1927 లో రాసినప్పటికీ, మొదటిసారిగా ప్రచురితమైనది మాత్రం 1930 వ సంవత్సరం లో. అదీ ఆయన మరణాంతరం.ప్రత్యేకమైన రచన గా ఆంగ్ల సాహిత్యం లో పరిగణన పొందింది.


ముఖ్యంగా ఆనాటి రోజుల్లో ఇంగ్లాండ్ లోని గ్రామీణ ప్రాంత జీవనాన్ని,నమ్మకాల్ని ఇది చిత్రిక పడుతుంది.స్త్రీ,పురుషుల మధ్య గల సంబంధాల్ని వివరిస్తుంది.అంతేకాదు,ఇంకా కొన్ని అదనపు సొబగుల్ని మనకి తెలియజేస్తుంది. ఆనాటి ఆంగ్లేయుల సమాజం లో జిప్సీ ల యొక్క స్థానాన్ని అర్ధం జేసుకోవడం తో బాటు ఇద్దరు యువతులు వారి యొక్క భావ ప్రపంచాన్ని మనం దర్శిస్తాము.


పాత్రల పేర్లను ,కొన్ని ముఖ్యమైన పేర్లను ఇంగ్లీష్ లోనే ఉంచడం జరిగింది.దాని ప్రభావం ఆ మేరకు పఠిత పై ఉండాలనే ఉద్దేశ్యం తోనే అలా ఉంచడం జరిగింది.మన తెలుగు రచయిత చలం గారి మీద కూడా లారెన్స్ గారి ప్రభావం ఉన్నట్లు కొంతమంది చెప్పగా విన్నాను.దానిలో ఎటువంటి అతిశయోక్తి ఉండకపోవచ్చును,ఎందుకంటే మనిషి కి ఉన్న అని సంకెళ్ళను తెంచి స్వేచ్ఛ వైపు మళ్ళించడం లో ఇద్దరి దృక్పథం ఒకటే..!


           ----- మూర్తి కెవివిఎస్ 

                (అనువాదకులు)      

వీథికుక్క-1

 ఒకరోజున, అది ఏ రోజో సరిగా గుర్తులేదు గానీ...రమారమి ఆరు నెలల క్రితం మా బయట గోడ ని ఆనుకుని ఓ బక్క కుక్క పడుకుని ఉంది. వాన చినుకులు పడుతున్నాయ...