29, నవంబర్ 2020, ఆదివారం

"సావి శర్మ" నవల



 సావి శర్మ రాసిన ఈ నవల Stories we never tell ఈ రోజే పూర్తి చేశాను.సూరత్ కి చెందిన ఈ యువ రచయిత్రి గతం లో మూడు నవలలు రాసింది,అవి చాలా మటుకు బాగానే పేరు తెచ్చుకున్నాయి.ఎక్కువ గా యువతరం సమస్యల్ని కేంద్రం గా చేసుకుని రాయడం వల్ల కాలేజి కి వెళ్ళే యువత ఇంకా ఆ వయసు వాళ్ళు ఎక్కువ గా ఈమె రచనలకి ఎక్కువ గా కనెక్ట్ అవుతుంటారు.


ఈ నవల కూడా ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల్ని ప్రస్తావించింది.నాలుగు పాత్రలు.ఇంకా కొన్ని చిన్న పాత్రలు.నగరాల్లో ఉద్యోగించే యువతీ యువకులు,వారి ప్రేమలు,వారి మానసిక రుగ్మతలు బేస్ చేసుకొని రాయబడిన నవల ఇది. గొప్ప క్లాసిక్ అని చెప్పలేము గాని నేటి యువతరాన్ని దృష్టి లో పెట్టుకుని రాసినది అని చెప్పవచ్చు.వెస్ట్ లాండ్ వారి ప్రచురణ.వీలైతే ఒకసారి చదవవచ్చును. కథ చెప్పిన విధానం బాగుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వీథికుక్క-1

 ఒకరోజున, అది ఏ రోజో సరిగా గుర్తులేదు గానీ...రమారమి ఆరు నెలల క్రితం మా బయట గోడ ని ఆనుకుని ఓ బక్క కుక్క పడుకుని ఉంది. వాన చినుకులు పడుతున్నాయ...